ఆదాయపన్ను పెరిగిందన్న నిపుణులు

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఆదాయ పన్ను రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఏడాదిక్రతం అంచనా వేసారు. ఇప్పుడదే నిజమయ్యింది. ఆదాయపన్ను రిటర్నులు, పాన్‌ కార్డులు సమర్పించే వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్‌ చేయడం ద్వారా ఆదాయ పన్నుశాఖ నోటీసులు జారీ చేసి పన్ను రాబట్టుకునే అవకాశం వచ్చింది. ఈ చర్య పూర్తిగా నల్లధనాన్నినివారించలేకున్నా.. ఈ ఏడాది ఆదాయం చూపెట్టడం ద్వారా పన్నుల ఎగవేతను అరికట్టే సౌకర్యం ఏర్పడిందని అంటున్నారు. నల్లధనంలో కొంత భాగాన్ని విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారు. నోట్ల రద్దు వల్ల వారికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేకపోయింది. అవినీతి అధికారులకు, లంచగొండి రాజకీయ నాయకులకు ఈ నిర్ణయం అశనిపాతం అవుతుందని భావించినా అలాంటిదేవిూ లేకుండా పోయింది. వేయి ఇచ్చే లంచం 2వేలకు చేరింది. ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. లెక్కలు చూపకుండా, పన్నులు చెల్లించకుండా దాచిపెట్టిన ధనం సాధ్యమైనంత వరకు బయటకు రావడానికి ఆస్కారం ఉందనుకున్నా అలాంటిదేవిూ జరగలేదు. నల్లధనం వైట్‌ మనీగా అవుతుందనుకున్నా అలా జరగలేదు. పేదవారికి, మధ్యతరగతి వారికి, వేతన జీవులపై పెద్దగా ప్రభావం పడదనుకున్నా వారే నష్టజీవులగా మిగిలారు.