ఆదాయ పన్ను గడువు పెంపు

1
సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి):

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయలేదని ఆందోళన పడుతున్నారా? అయితే కాస్త ఆగండి.. ఇందుకు గడువును ఈనెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆగస్టు 31వ తేదీతో ఈ గడువు ఇంతకు ముందు ముగిసింది. అయితే, ఇంకా చాలామంది రిటర్నులు దాఖలు చేయాల్సి ఉండటంతో.. ఈ గడువును సెప్టెంబర్‌ 7 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతుండటంతో.. ఆ ఒక్క రాష్ట్రానికి గడువును పెంచుతూ ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఇప్పుడు దాన్ని మొత్తం దేశానికి వర్తింపజేశారు. దేశంలో మొత్తం 4 కోట్ల మందికి పైగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 7.98 లక్షల కోట్ల మేరకు ఆదాయపన్ను వసూలవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.