ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వాంఖిడి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పింది. డ్రైవరు బస్సును అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే ఇద్దరు వ్యక్తులు బస్సులో నుంచి బయటకు దూకారు. వారిలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.