ఆదిలాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ సంబురాలు
ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటు ఆవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని.. 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. స్కూల్, కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున 2 కే రన్ లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణను సాధించే వరకు విశ్రమించమని మంత్రి జోగు రామన్న చెప్పారు.