ఆదిలాబాద్ అటవీశాఖ ఉన్నతాధికారి హఠాన్మరణం
ఆదిలాబాద్,నవంబర్7(జనంసాక్షి): ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి సంజయ్‌కుమార్ గుప్తా(48) మంగళవారం హఠాన్మరణం చెందారు. సోమవారం ఛాతి నొప్పి రావడంతో రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈజీసీ సాధారణంగా ఉందని, కేవలం గ్యాస్ సమస్య అని వైద్యులు చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం అధికారిక నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో
ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. ఆదిలాబాద్ కలెక్టర్ బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతి గుప్తా ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. గుప్తా స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్ కాగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.