ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్‌ఎఫ్‌ఐ ధర్నా
ఆదిలాబాద్ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎఫ్‌ఐ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు.