ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి చర్యలు: జోగురామన్న
ఆదిలాబాద్,సెప్టెంబర్9జనంసాక్షి): ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.50కోట్ల నిధులు రానున్నాయని మంత్రి జోగు రామన్న తెలిపారు. నిధులతో ప్రధాన రహదారులతోపాటు, కాలనీల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడతామని చెప్పారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో శనివారం రూ. 8లక్షలతో నిర్మించే సీసీరోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాన్ని అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హావిూ ఇచ్చారు. ఎక్కడా ఏ సమస్యా లేకుండా చేస్తామని చెప్పారు. హరితహారంలోమొక్కలు నాటడం వల్ల్ పట్టణంలో పచ్చదనం వెల్లి విరిసిందన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు,పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ మనీషా, ఐసీడీఎస్ ఆర్గనైజర్ ప్రేమల, తెరాస నాయకులు గోవర్ధన్‌రెడ్డి, తాజుదుద్దీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.