ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Untitled-3
– కోమురం భీం వర్ధంతి సభలో మంత్రి కేటీఆర్‌
ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): ఇంతకాలం అనాగరికంగా, ఎక్కడో ఏరిపారేసినట్లుగా ఉన్న గిరిపుత్రులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుపున పెట్టుకుని అభివృద్ది చేసి తీరుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన గిరిజనుల ఆరాధ్యదైవం అయిన కొమురం భీం 75వ వర్దంతి వేడుకలు  కెరెమేరి మండలం జోడేఘాట్‌లో ఘనంగా జరుగగా ఆకార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన రాష్ట్రమంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, ఎంపి గోడెం నగేశ్‌, జిల్లా కలెక్టర్‌ జగన్‌మోహన్‌ తదితరులతో కలిసి కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ కొమురం భీం ఏనాడో తెలంగాణా కోసం ఆరాటపడ్డ వ్యక్తి అని ఆయనను గుర్తించేందుకు కూడా గత పాలకులకు చిత్తశుద్ది లేకుండా పోయిందన్నారు. ఉద్యమ సమయంలో చెప్పినట్లుగానే నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా జోడేఘాట్‌కు వచ్చి స్వర్గీయ కొమురం భీం ఆశయాలను బాహ్య ప్రపంచానికి చాటి చెప్పేలా అనేక చర్యలను చేపట్టారన్నారు. జల్‌, జంగిల్‌, జవిూన్‌ పేరుతో కొమురం బీం నిజాం నవాబులపై పోరాడిన క్రమం చరిత్రలో సజీవంగా ఉంటుందన్నారు. కొమురం భీం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పష్టం చేశారు. జల్‌, జంగల్‌, జవిూన్‌ పేరుతో కొమురం భీం పోరాటం సాగించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశామని తెలిపారు. సమైక్య పాలనలో ఎందరో సీఎంలు వచ్చారు, పోయారు కానీ జోడెఘాట్‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌ ఒకేఒక్కరని తెలిపారు. సీఎం కేసీఆర్‌ జోడెఘాట్‌లో కొమురం భీంకు నివాళులర్పించారని పేర్కొన్నారు. గిరిజనుల ముద్దు బిడ్డ కొమురం భీం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మహనీయుల వర్ధంతి, జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆదివాసీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ప్రతీ గిరిజన తండాకు వచ్చే మూడేళ్లలో వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. ఐదు వందల జనాభా కలిగిన ప్రతీ గిరిజన తండాను గ్రామ పంచాయతీగా మార్చుతామన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలు ప్రతీ గిరిజన తండాలో జరుగుతాయన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. గిరిజనులకు తండాల్లో వైద్య సేవలు అందించేందుకు వైద్యులకు, సిబ్బందికి ఎక్కువ జీతాలు ఇచ్చి తండాల్లో వైద్య సేవలు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు. జోడేఘాట్‌కు 50 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. త్వరలో కొమురం భీం స్మారక నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఆదివాసీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ప్రతి గిరిజన తండాకు వచ్చేమూడెళ్లలో వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా తాగునీటిని అందిస్తామన్నారు. ఐదు వందల జనాభా కలిగిన తండాను రానున్న ఎన్నికల్లోనే ఖచ్చితంగా పంచాయితీలుగా చేసి తీరుతామన్నారు. వచ్చే ఎన్నికలు తండాల్లోనే  జరుగుతాయన్నారు. గిరిజనులకు తండాల్లో వైద్యం అందించేందుకు వైద్యులకు ప్రత్యేక వేతనాలిచ్చి ప్రోత్సహిస్తామన్నారు. జోడేఘాట్‌కు 50 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే కొమురం భీం స్మారక నిర్మాణాన్ని, మ్యూజియంలను పూర్తిచేస్తామన్నారు. మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తున్నామన్నారు.  అంతకుముందు కొమురం భీం ముని మనువడు సోనేరావు, వంశీకులు భీం సమాదివద్ద ప్రత్యేకంగా పూజలుచేసి నాలుగురకాలజండాలను ఎగురవేశారు ప్రభుత్వం పక్షాన తొలుత ఐటీడీఏ పిఓ ఆర్‌ ఈ కరుణన్‌, బెల్లంపల్లి ఏఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్యే బాపూరావు లు పూజలు నిర్వహించారు.