ఆధార్,రేషన్ కార్డుల ప్రకారం ఇండ్లు డిఎన్ డిడి నోటిఫికేషన్ ప్రకటించాలి.

 

తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసిన భూ నిర్వాసితులు

మల్హర్ జనంసాక్షి

ఆధార్,రేషన్ కార్డులు,గ్రామపంచాయతీ రికార్డుల ప్రకారం తాడిచెర్ల మైన్ కు డేంజర్ జోన్ 500 మీటర్ల దూరంలో ఉన్న స్థానికుల భూములు,ఇండ్లను డిఏన్ డి పబ్లిస్ నోటిఫికేషన్ ప్రకటించాలని భూ నిర్వాసితులు సోమవారం తహశీల్దార్ జీవాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడారు గనికి 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న భూములు,ఇండ్లు,చెట్లు, ఇల్లు,చెట్టు,బావులు, ఇతరత్రవన్నీ సేకరిస్తామని రెవెన్యూ, జెన్కో అధికారులు గత ఆరు నెలల క్రితం సంయుక్తంగా సర్వేలు నిర్వహించి ప్రతి యుక్తి టిఎస్ జెన్కో పేరుతో వేసిన నెంబర్ల ప్రకారం మొత్తం 2,260 ఇండ్లను ఒకేసారి డిఎన్ డిడి పబ్లిస్ చేయాలని విజ్ఞప్తి చేశారు.డేంజర్ జోన్లో ఉన్న ప్రతి ఇల్లు గ్రామపంచాయతీ పరిధిలోనే ఉన్న విషయాన్ని అధికారులు గమనించి స్థానికులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుంకరి సత్యనారాయణ, భూ నిర్వాసితులు పన్నాల ఓదేలు, తాండ్ర మార్కు, బూడిద మల్లేష్,కేశారపు రాజయ్య,మల్కా సతీష్,వొన్న తిరుపతి రావు,మాచర్ల సురేష్,తిర్రి సమ్మయ్య, డేవాదానం,సాంబయ్య,ఆగయ్య పాల్గొన్నారు.