ఆధార్ కేంద్రం ఏర్పాటుచేయాలని వినతి
జూలపల్లి: జూలపల్లి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రం ఏర్పాటుచేయాలంటూ తహసీల్దార్ వెంకటమాధవరావుకు సోమవారం తెరాస ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద కొంతసేపు నినాదాలు చేశారు. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తహసీల్దారుకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామస్వామి, రాజలింగం, శంకరయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.