ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

దేవాలయాలు శక్తి కేంద్రాలు
-ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి  పేర్కొన్నారు. మంచాల మండలం అగపల్లి గ్రామంలో  నూతనంగా నిర్మించిన ఊర పోచమ్మ దేవాలయంలో బుధవారం విగ్రహప్రతిస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. దేవీ ఉపసకులు రేవల్లి రాజు శర్మ ఆధ్వర్యంలో 5 గంటల నుండి ప్రత్యేక పూజలు పూర్ణాహుతి,విగ్రహాప్రతిష్ఠ కార్యక్రమాలుజరిగాయి.ఎమ్మెల్యే మంచిరెడ్డి,మాజీ ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి,చిలుక మధుసూదన్ రెడ్డిలు అమ్మవారి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు మానసిక శక్తి కేంద్రాలని దైవ దర్శనంతో శారీరక మానసిక సమస్యలు తగ్గి ప్రశాంత లభిస్తుందన్నారు. మనిషిలో  ఆధ్యాత్మిక శక్తి పెరిగితే మానసిక శక్తులు జాగృతం అవుతాయన్నారు.మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ యాంత్రిక జీవన విధానంలో చిక్కిన మనిషి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు  దైవ చింతన మాత్రమే ఉరట నిస్తుందని  ప్రతి వ్యక్తి తనకున్న సమయంలో దేవాలయ దర్శనం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆలయ నిర్మాణం దాతలు టీఆర్ఎస్ నాయకులు బర్ల జగదీశ్వర్ యాదవ్,గండికోట జంగయ్య ,గ్రామ పురోహితులు మడుపు నటరాజ శర్మ, పసునూరి శ్రీనివాస్ గుప్తా,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, సర్పంచ్ జంగయ్యయాదవ్ , వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు నాగభూషణం గౌడ్, జంగయ్య యాదవ్, శేఖర్ గౌడ్,ఇబ్రహీంపట్నం ఎంపిపి కృపేష్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి,మాజీ చైర్మన్ భరత్ కుమార్ ,కౌన్సిలర్లు బర్ల మంగ, మమత శ్రీనివాస్ రెడ్డి,నీలం శ్వేత, నీళ్ల భాను,జెర్కొని బాలరాజ్,యాచారం రవీందర్,టిఆర్ఎస్ నాయకులు నల్లబోలు శ్రీనివాస్ రెడ్డి, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. రెండవ రోజు భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.