ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు అగస్టు 27(జనంసాక్షి)శ్రావణమాసం అమావాస్య ముగింపు సందర్భంగా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామిని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు ,మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రి టీఆరెస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్,  డి.పి.సి సభ్యులు పట్లోళ్ల నర్సింలు,వారి కుమార్తెలు సాయి రాఘ-సాయి శ్లోక  లతో కలసి కుటుంబసమేతంగా దేవాలయంలో శివుడికి అభిషేకం మరియు ప్రత్యేకపూజలు నిర్వహించారు.అనంతరం దేవాలయ ప్రధానఅర్చకులు వేదమంత్రోచణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. మున్సిపల్ పరిధిలోని 9వ వార్డ్ సాయిపూర్ లోని శ్రీ ప్రసన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో మరియు రసుల్ పూర్ హనుమాన్ మందిరంలో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా కుటుంబసమేతంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ..దక్షిణకాశీ గా పిలిచే ఎంతో ప్రసిద్ధి గాంచిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కొలువైన అది దేవుడి దర్శనార్థం కుటుంబసమేతంగా ఇక్కడికి రావడం జరిగిందని,ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి సోమవారం జాతర ఉత్సాహలు ఘనంగా జరుగుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లిలో వెలసిన ఏకాంబరి రామలింగేశ్వర దేవాలయానికి ఇతర రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుందని,ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు..