ఆనాటి మారణహోమంలోఅమరులకు కేంద్ర మంత్రి నివాళి ఆ ఘటనకు నాలుగేళ్లు పూర్తి!
ముంబయి, నవంబర్ 26 (జనంసాక్షి): ముంబయి మారణహోమంలో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారంనాడు నివాళులర్పించింది. చౌపట్టిలోని పోలీసు జింఖానా మైదానంలో సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే పాల్గొని నివాళులర్పిం చారు. మరో కేంద్రమంత్రి శరద్‌పవార్ కూడా స్మారక చిహ్నానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ శంకర్‌నారాయణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చవాన్, హోం మంత్రి పాటిల్ కూడా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా నాటి దాడుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారీ భద్రత..
ముంబయి 26/11 ఉగ్రవాదులు దాడి జరిగిన నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారంనాడు ముంబయి, ఢిల్లీ నగరాల్లో పోలీసులు భారీ భద్రత చర్యలు చేపట్టారు. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. కసబ్ ఉరికి ప్రతీకారం తీర్చుకుంటామని ఒక ఉగ్రవాద సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. అలాగే ముంబయిలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరమంతటా భారీ ఎత్తున పోలీసులను మొహరించారు. కీలక స్థానాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. పోలీసులు అన్ని మార్గాల్లోనూ రాకపోకలు సాగిస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఆ మారణహోమానికి నాలుగేళ్లు పూర్తి!
మూడు రోజులు ఏకధాటిగా లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన కమెండో తరహా దాడుల్లో 166 మంది అమాయకులు బలైన విషాద దృశ్యం.. ఇప్పటికీ భారతీయుల మది పొరలపై కదలాడుతునే ఉన్నాయి. ముంబయి 26/11 దాడులకు సోమవారంతో నాలుగేళ్లు పూర్తయ్యాయి. దాడులకు పాల్పడ్డ వారిలో