ఆమె ఉద్యమ బిడ్డ!!
ఆ యోధునికి పుట్టిన బిడ్డ
ఆమె మహిళ మాత్రమే కాదు
ఉక్కు సంకల్పం కలిగిన ఒక ధీర వనిత
ఆమెను ఏ శక్తి ఏమి చేయలేదు
ఆమెకు ఉన్న శక్తి ముందర
మీ నాటకాలు అన్నీ పరార్!
ఉద్యమం నేర్పిన పాఠం
తండ్రి ఆలోచనలు నేర్పిన సంస్కారం
అవన్నీ
నిత్యం ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నప్పుడు
కనిపిస్తాయి!
ఆమె నిరంతర అన్వేషి
బహుముఖ ప్రజ్ఞాశాలి
ఒక స్పష్టమైన లక్ష్యం కలిగిన నేత!
ఆమెను ఏది, ఎవరు నిలువరించలేరు
ఆమెను నిర్బందించడానికి ప్రయత్నిస్తే
మిమ్మల్ని మీరు నిర్భంధించుకున్నట్లే!
ఆమె పోరాటంలో నుండి ఉద్భవించిన
గొప్ప సైనికురాలు!
ఆ యోధునితో నేరుగా పోరాడలేక
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం
మీరు పడుతున్న ఇక్కట్లే ఇవన్నీ!!
( చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుకు కల్వకుంట్ల కవిత గారి పోరాటమే కారణం )
– కళ్ళెం నవీన్ రెడ్డి
– కామారెడ్డి
– 9963691692