ఆయన సేవలు అపూర్వం
విజయనగరం, జూలై 16: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మరిచర్ల సింహాచలంనాయుడు జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఉద్యోగులు రక్తదానం చేశారు. ఆయన బతికి ఉన్న రోజుల్లో ప్రతిఏటా తాము చైర్మన్ పుట్టినరోజునాడు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేవారిమని, అయితే ఈ ఏడాది జూలై 3న ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఇప్పుడు రక్తదానం చేస్తున్నామని కార్యక్రమానికి నాయకత్వం వహించిన సిఇఓ శివశంకర్, హేమసుందర్ తెలిపారు. రక్తదాన శిబిరంలో దాదాపు 100 ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం సింహాచలంనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.