ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
పెద్దవంగర నవంబర్ 19(జనం సాక్షి )రైతులందరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో అందించే ఆయిల్ ఫామ్ మొక్కలను సద్వినియోగం చేసుకోవాలని తెరాస మండల పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తెలిపారు.
పెద్దవంగర మండల అగ్రికల్చర్ వారి ఆధ్వర్యంలో శనివారం పోచంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.తరువాత మాట్లాడుతూ మండలంలోని రైతులందరు ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలని ప్రతేక్య దృష్టి సారించారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 90% శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కలను రైతులకు అందిచడం జరుతుందని తెలిపారు.ఆయిల్ ఫామ్ సాగు వలన రైతులకు అధిక మొత్తంలో లాభాలు వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సూర్యనారాయణ, ఏ ఒ కుమార్ యాదవ్, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ వి . రాంచంద్రయ్య శర్మ, తెరాస నాయకులు సుధాగాని మనోహర్, రాజమన్సింగ్ తండా సర్పంచ్ గుగులోత్ పటేల్ నాయక్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, తెరాస నాయకులు శ్రీరాం సుదీర్, మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, మండల యూత్ అధ్యక్షులు కాసాని హరీష్, ఏ ఈ ఒ కాటమ రాజు,రాజమన్సింగ్ తండా పార్టీ అధ్యక్షులు జాటోత్ కిషన్, మాజీ సర్పంచ్ గుగులోత్ పుణ్య నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు