ఆయిల్ ఫామ్ సాగుతో పంట మార్పిడి

రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
మోత్కూరు డిసెంబర్ 5 జనంసాక్షి : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మోత్కూరు మండలం పరిధిలోని పాటిమట్ల, దత్తప్పగూడెం, అనాజిపురం రైతు వేదికలలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించడం జరిగింది. పాటిమట్ల రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేల ప్రాముఖ్యత,భూసార పరీక్షల ఆవశ్యకత వివరించి పంట మార్పిడిలో భాగంగా రైతులు ఆయిల్ ఫామ్ పంటను ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించి ఆయిల్ ఫామ్ పంట ఆవశ్యకత, రాయితీ వివరాలను, నేల సారవంతం చేయడంలో ఈ పంట ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి స్వప్న మాట్లాడుతూ జీవన ఎరువులు పచ్చిరొట్టై ఎరువుల వాడకం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ భూసార పరీక్షకు అవసరమైనా మట్టి నమూనాలు సేకరించు విధానంను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ సోమల్లు, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు పద్మ, సర్పంచ్ మల్లేష్, నాగయ్య, కోఆర్డినేటర్లు కోటిలింగం, సత్తయ్య, ప్రధానోపాధ్యాయులు అగ్గిరాములు, వ్యవసాయ విస్తరణ అధికారులు సైదులు సింహప్రసాద్, ఆయిల్ ఫామ్ కోఆర్డినేటర్ ప్రవీణ్,మమత రైతులు శ్రీనివాస్,వేణు,లింగయ్య,సోమిరెడ్డి,సంజీవరెడ్డి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు