ఆయిల్ ఫామ్ సాగు రైతుకు మేలు
కుబీర్ ( జనం సాక్షి 18); కుబీర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన, కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయ సాగు విధానం వల్ల అతివృష్టి అనావృష్టిలు సంభవించి రైతులు ఏటా ఆర్థిక నష్టాలను చవి చూస్తున్నారు అన్నారు. ఆయిల్ ఫామ్ సాగు వల్ల ఎకరంకు రూపాయలు లక్ష ఆదాయం సమకూరుతుందని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు రాయితీలు అందిస్తుందన్నారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రైతులు లక్ష ఎకరాల్లో ఈ పంటను వేశారన్నారు. రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ హర్షవర్ధన్ రెడ్డి, సర్పంచ్ మీరా విజయ్ కుమార్ ,వైస్ ఎంపీపీ మోయునుద్దిన్,ఆర్ బి ఎస్ మండల అధ్యక్షులు పుప్పాల పీరాజి,ఏఎంసీ చైర్మన్ కందూర్ సంతోష్ ,ఎంపీటీసీ పోసానిబాయి ,వార్డు సభ్యులు గోరేకర్ సాయినాథ్, ప్రసాద్ ,కళావతి సురేష్ ,ఏఈఓ రమేష్,ఆయిల్ పామ్ క్లస్టర్ ఆఫీసర్ గోపి, రైతులు ఇతరులు పాల్గొన్నారు.