*ఆయిల పామ్ సాగుతో రైతులకు మేలు.
జడ్పిటిసి గొర్రె సాగర్.
చిట్యాల22( జనంసాక్షి) రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు నూతన పంటలైన ఆయిల్ఫామ్ సాగు తో లాభసాటి మేలు జరుగుతుందని జడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. బుధవారం మండలంలోని ఒడితల,నైన్ పాక,చైన్ పాక రైతు వేదికలలో ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ మండల అధికారి నాలిక రఘుపతి ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పిటిసి గొర్రె సాగర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ పంటలు వేయాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు, బిందు సేద్య పరికరాలు, అంతర పంటలకు విత్తనాలను అందజేస్తుందని, రైతులు ఉద్యాన పంటల సాగుపై మొగ్గు చూపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధి అరవింద్, ఏఈఓ రమణకుమార్, సర్పంచులు ఎర్రబెల్లి సాంబలక్స్మి, పులి వెంకటేష్, పెండం సాంబమూర్తి, పోచయ్య, రైతువేదిక క్లస్టర్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.