ఆరు కోట్ల రూపాయలతో పదివేల ఇంకుడు గుంతలు

మేయర్‌
హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఈ ఏడాది 6 కోట్ల రూపాయల వ్యయంతో 10 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ ప్రజల్ని కోరారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన ఇంకుడు గుంతల అవగాహన కార్యక్రమంలో మేయర్‌తోపాటు ఉపమేయర్‌ రాజ్‌కుమార్‌, ఇతర జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల ఏర్పాట్లు కోసం జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అధికారులకు తగిన అదేశాలు ఇచ్చిందని మేయర్‌ తెలిపారు. వీటిలో ఏమైనా అనుమానాలుంటే అధికారుల్ని సంప్రదించాలని కోరారు.