ఆరోగ్య మహిళా కార్యక్రమం నిర్వహణ.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్:-రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళా క్లినిక్లలో ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మహిళల నుండి మంచి స్పందన లభిస్తుందని మహిళలందరు ఈ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి వి.సాహితీ అన్నారు.మున్సిపల్ పరిధిలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ పి నాగిని ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మహిళల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని, ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అనంతరం 43 మందికి మహిళలకు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా అవసరమైన 31 మందికి చెందిన మహిళల రక్త నమూనాలను సూర్యాపేట టీ హబ్ కి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పున్న నాగిని, ఆర్ శృతి, సూపర్వైజర్ జయమ్మ, స్వాతి సునీత ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

తాజావార్తలు