ఆరోగ్య మెగా హెల్త్ క్యాంపులు నిర్వహణ
మెదక్, అక్టోబర్ 8: ఈ నెల 12,19, 20 తేదీల్లో ఆరోగ్యశ్రీ మెగాహెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు సోమవారం నాడు ఇక్కడ తెలిపారు. ఈ నెల 13, 14 తేదీల్లో జోగిపేట, పటాన్‌చెరులో, 20న సిద్దిపేటలో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిబిరాలలో అన్ని రకాల వ్యాధులకు స్పెషలిస్టు వైద్యులచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. 12న నర్సాపూర్ సిహెచ్‌సి ఆసుపత్రి, హైదరాబాద్ నుంచి మమతా హాస్పిటల్ వైద్యులు, నర్సింగ్ హోం ఊడ్‌ల్యాండ్ హాస్పిటల్ వైద్యులు, జోగిపేట సిహెచ్‌సి ఆసుపత్రి వైద్యులు, జిల్లా కేంద్ర ఆసుపత్రి సంగారెడ్డి వైద్యులు మెగా హెల్త్ క్యాంపులలో పరీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. 19న జహీరాబాద్‌లో, 20న దుబ్బాక సిహెచ్‌సి హెల్త్ క్యాంపులలో పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. మెగా హెల్త్ క్యాంపులకు తెల్లరేషన్ కార్డు తప్పని సరిగా తీసుకురావాలని ఆయన అన్నారు.