ఆర్కతల గ్రామాన్ని ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

ఆర్కతల గ్రామాన్ని ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి)
మండలంలో ఆర్కతల గ్రామాన్ని ఆరోగ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలం ఆర్కతల గ్రామంలో ఎంపీ రంజిత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్న చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఐదు లక్షల వరకు పెంచడం తోపాటు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాల్లోని నిరుపేద ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం మనదే దిశగా పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి మల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రావు గారి వెంకట్ రెడ్డి ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఎంపీడీవో సుమిత్ర దేవి శంకర్పల్లి జెడ్పిటిసి గోపాల్ రెడ్డి సర్పంచులు ప్రభాకర్ రంగారెడ్డి మా మణెయ్య రంగారెడ్డి రత్నం రంగారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు