ఆర్టీఏ తనిఖీ కేంద్రంపై ఏసీబీ దాడి
బిక్కనూర్ : నిజామాబాద్ జిల్లా బిక్కనూర్ మండలంలోని జంగంపల్లి శివారులోని ఆర్టీఏ తనిఖీ కార్యాలయంపై ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్సీ సంజీవరావు ఆధ్వర్యంలో తనిఖీ కేంద్రంలో ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 1.14 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీ కేంద్రంలో ఎంవీఐ అశోక్‌కుమార్‌తోపాటు ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.