ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం
హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను తొలగించకుండా సీఎం కిరణ్ వారికి కాపాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ అవినీతి మంత్రులకు ఉద్వాసన పలకాలని అన్నారు. వచ్చే అంసెబ్లీ సమావేశాలను కనీసం ఇరవై రోజులైనా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అయినా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని, అవినీతి సర్కారును సాగనంపాలని అన్నారు.