ఆర్టీసీలో సమ్మె సైరన్
` మే 6 అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె
` ఆర్టీసీ జేఏసీ నిర్ణయం
` ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.