ఆర్టీసీ ఆన్‌లైన్‌ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు

హైదరాబాద్‌ : ఆర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో ప్రధాన నిందితుడు హనుమంతరావును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ. 20 వేలు, ఐపీ అడ్రస్‌లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అన్‌లైన్‌ రిజర్వేషన్ల అక్రమాల కేసులో మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు.