ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల జీతంతో కలిసి డీఏ బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకరించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.