ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ:ఇద్దరి మృతి

చిత్తూరు: చంద్రగిరి మండలం తండవాడ వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై గురువారం అర్థరాత్రి ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.