ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితం గుమ్మడవల్లి గ్రామంలో ఆర్టీసీ వినియోగంపై అవగాహన..

కొండమల్లేపల్లి అక్టోబర్ 11 జనం సాక్షి :
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం ప్రజలకు సురక్షితమని దేవరకొండ ఆర్టిసి డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్ కుమార్ అన్నారు మంగళవారం కొండమల్లేపల్లి మండల పరిధిలోని గుమ్మడవల్లి గ్రామంలో ప్రజలకు ప్రయాణికులకు ఆర్టీసీ పై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల కోసం ఆర్టీసీ అన్ని రకాల సేవలను అందిస్తుందని గ్రామాల్లో ప్రజలు నిర్వహించే వివాహ వేడుకలకు శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దకిరాయికి ఇవ్వబడునని అన్నారు మారుమూల గ్రామాలకు కూడా బడి పిల్లలు ప్రజల కోసం స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని ప్రజలకు అవగాహన కలిగించారు ప్రతి ప్రయాణికుడు కూడా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని వారికి ఆర్టీసీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు గుమ్మడవల్లి గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు దేవరకొండ డిపో నుండి నల్గొండకు బయలుదేరి ఎక్స్ప్రెస్ బస్సులు కూడా గుమ్మడవల్లి బస్టాప్ లో ఆగే అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, ఆర్టీసీ అధికారులు ఎన్ వి నారాయణ, డివి నారాయణ, వెంకటేష్, బోడ హనుమంతు, బచ్చనబోయిన శ్రీనివాస్ యాదవ్, కొండమీది శంకర్, కన్నె ఇద్దయ్య యాదవ్, లింగంపల్లి రమేష్, అంజి యాదవ్, ఆంజనేయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు