ఆర్టీసీ బస్సు డీకొని ఇద్దరు కాంగ్రెస్‌ నేతల మృతి

తొండగి: తూర్పుగోదావరి జిల్ల తొండంగి మండల పరిధిలోని అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వుణుగోపాల్‌రావు, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డిలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఈ ప్రమాదం సంభవించింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బోత్స వివాహనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.