ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
జనం సాక్షి
టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.
తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందిన గవర్నర్ తాజాగా ఆ బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిని గవర్నర్‌కు పంపించగా.. ఆమె కొన్ని అంశాలపై అధికారుల వివరణ అడిగారు. అంతేకాకుండా 10 సిఫారసులు చేశారు. వీటిపై ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై.. తాజాగా బిల్లుకు ఆమోదం తెలిపారు.