ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

-తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ

తొర్రూరు 18 అక్టోబర్ (జనంసాక్షి )
గ్రామస్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు డిపో మేనేజర్ కె.పరిమళ అన్నారు.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చేపట్టిన ప్రజల వద్దకు ఆర్టీసీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని వెలికట్ట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ను పరిశీలించి, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వెలికట్ట గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గ్రామంలో ఉన్న స్టేజి వద్ద ప్రతి బస్సు ఆగే విధంగా రిక్వెస్ట్ బస్ స్టాప్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు.శిథిలావస్థకు చేరుకున్న బస్టాండ్ స్థానంలో కొత్త బస్టాండ్ ఏర్పాటుకు జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.వికలాంగులకు బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోసాని పుష్పలీల,బోజ్యా తండా సర్పంచ్ కాలు నాయక్,ఉప సర్పంచ్ దీకొండ పంచాయతీ కార్యదర్శి రమేష్,నాయకులు పోసాని రాములు,బత్తుల యాకయ్య,అనపురం వెంకన్న,బొగ  కమలాకర్,మడిపెద్ది వెంకన్న,సంపత్,బిక్షపతి,వెంకట సోములు,సుధాకర్,కర్నాకర్,కొమురయ్య, లక్ష్మన్,ఆర్టీసీ సిబ్బంది సత్తయ్య,వెంకన్న, రాజ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.