ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) ధర్నా
నర్సంపేట, జూన్ 6 (జనంసాక్షి):
ఖానాపురం మండలం చిలుకమ్మ నగర్ పేదలకు ప్రభుత్వం గృహా లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) ఆధ్వ ర్యంలో బుధవారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు
ముందు పాఖాలసెంటర్ నుంచి ప్రారంభ మైన ర్యాలీ పట్టణ పుర వీధుల గుండా ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. సుమారు గంటపాటు ఆర్టీవో కార్యాలయం ఎదుట ధ ర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో వేల్పుల సదానందంకు సీపీిఐ(ఎంఎల్) నాయకులు అంద జేశారు. ఈధర్నను ఉద్ధేశించి సీపీఐ(ఎంఎల్) నర్సంపేట జోనల్ నా యకుడు ఈర్లపైడి మాట్లాడుతూ చిలుకమ్మనగర్ గ్రామ పేదల కు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడంలో ప్రభుత్వాది óకా రులు పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. ఈ గ్రామంలో నివ సించే ప్రజలు అత్యధికంగా ఎస్టీ, ఎస్సీ, బీసీలేనని పేర్కొన్నారు. కనీ సం ఉండడానికి గృహ వసతి లేని పరిస్థితిలలో ఉన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో ఇందిరమ్మ గృహాల కోస ం లబ్దిదారులు ధరఖాస్తు చేసుకున్నప్పటికి ఎంతమాత్రం పట్టించు కోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా హౌజింగ్ అధికారులు పట్టించుకోని గృహాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చే శారు. ఈ కార్యక్రమంలో పాపయ్య, పూర్ణ చందర్, కౌసల్య, భద్రు, ఉపెందర్, శాంతి, నర్సమ్మ, లక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.