ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ జిల్లా : జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు, మజర గోవన్‌పల్లి గ్రామానికి చెందిన గోవు పెంటయ్య (73) అనే రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రమైన నవాబుపేట సమీపంలోని పోచమ్మకుంట వద్ద పురుగుల మందు తాగి అత్యహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతాళలేకే పెంటయ్య అత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.