ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి మృతి
ఖానాపురం జూలై 6జనం సాక్షి
ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కొత్తి మాట్ తండా గ్రామంలో బుధవారం నెలకొంది. స్థానిక ఎస్ఐ పిట్టల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం కొత్తి మాట్ తండా గ్రామానికి చెందిన గుగులోతు సంతోష్ (20) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూమ్ లో గల ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని మృతి చెందినట్లు తెలుపుతూ మృతుడికి ఒక కుమారుడు రిషి (7) ఒక కూతురు మీనాక్షి(5) ఉన్నారని తెలుపుతూ మృతుడి తండ్రి రంగా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పిట్టల తిరుపతి తెలిపారు.