ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రావ్యకి సిల్వర్ మేడల్ రావడం అభినందనీయం.

మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళి గుప్త.
తాండూరు అక్టోబర్ 2 (జనం సాక్షి)ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రావ్యకి సిల్వర్ మేడల్ రావడం అభినందనీయమనిమున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త పేర్కొన్నారు.
ఆదివారం ఆర్యవైశ్య కళ్యాణమండపంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న హాజరయ్యారు.ఆర్య వైశ సంగం అద్వర్యం లో ఇంటర్మీడియట్ లో 92శాతం సాధించిన రొంపల్లి సంతోష్ కుమార్తె రొంపల్లి శ్రావ్య కి సిల్వర్ మెడల్ తో పాటు మెమెంటో తో మున్సిపల్ ఛైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ సత్కరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న మాట్లాడుతూ శ్రావ్య విద్యలో మరింత ఉత్తమ విద్యను అభ్యసించాలని మనసారా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్ , సెక్రటరీ కోట మురళి కృష్ణ , ఉపాధ్యక్షులు అలంపల్లి శ్రీనివాస్ , జాయింట్ సెక్రటరీ దాదాపురం రవీందర్ యాలాల మండల్ ఎంపిపి బాలేశ్వర్ గుప్త ,ఎంపీటీసీ ఫోరోమ్ అధ్యక్షులు దేవగారి రాములు ,నాగ్రెశ్వరా దేవాలయం చైర్మన్ కుంచం మురళి ,కౌన్సిలర్ సాహు శ్రీలత, మంకల్ రాఘవేందర్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కొట్రికే విజయలక్ష్మి మరియు సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.