ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ను కలవనున్న నరేంద్రమోడి

నాగ్‌పూర్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో నాగ్‌పూర్‌లో భేటీ కానున్నారు. వచ్చే నెలలో జరిగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు ఆ పని మానుకుని నాగ్‌పూర్‌ ప్రయాణమవుతున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని భాజపా ఎంపీ రామ్‌ జెఠ్మలాని గత వారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోడీ నాగ్‌పూర్‌ యాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది. భగవత్‌ను కలిసిన అనంతరం మోడీ మధ్యాహ్నం తిరిగి గుజరాత్‌ వెళ్లిపోతారు.