ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు.
*
ఖమ్మం అర్బన్, మార్చి 17 (జనంసాక్షి) టి. ఎస్. పి. ఎస్. సి. ప్రశ్న పత్రాల లీకేజి, గ్రూప్ 1 రద్దు కై తెలంగాణా రాష్ట్రం లోని 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగ నియామకాల్లో భాగంగా టి. ఎస్. పి. ఎస్. సి. బోర్డులో ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బి. ఎస్. పి. రాష్ట్ర అధ్యక్షులు
డా. ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని బి. ఎస్. పి. జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు అన్నారు.నిరుద్యోగుల పక్షాన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ ఎదురుగా బి. ఎస్. పి. ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో నిరుద్యోగులను ఉద్దేశించి జిల్లా ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు మేకతోట్టి పుల్లయ్య, బుర్ర ఉపేంద్ర సాహు మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు బి. ఎస్. పి. విజయమని అన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు నినాదంతో అధికారంలోకి వచ్చిన కె. సి. ఆర్. నియామక పరీక్షల ప్రశ్న పత్రాలు లీకవుతున్నా పట్టించుకోవడం లేదని, రాష్ట్రం లోని ఏ రాజకీయ పార్టీ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని, విద్యార్థుల బలిదానాలతో గద్దెనెక్కిన కె. సి. ఆర్. విద్యార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని, విద్యార్థులు తమ చావుకు ముఖ్యమంత్రి కారణమని లేఖలు రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని అన్నారు. విద్య విలువ తెలియని, పరిపాలన మీద పట్టులేని పాలకుల వలనే విద్యా, ఉద్యోగ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు.
నిరుద్యోగులకు అండగా, వారికి న్యాయం జరిగే వరకు
బి. ఎస్. పి. వారికి అండగా ఉంటుందన్నారు.
ఈ లీకేజి వ్యవహారంలో ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దును రేపు బి. ఎస్. పి. విజయోత్సవ వేడుకగా విద్యార్థులతో కలిసి జరుపుకోవాలని నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు అయితగాని శ్రీనివాస్ గౌడ్, బి. ఉపేందర్, సి. హెచ్. చంద్ర మోహన్, పి. విజయ్, జిల్లా మహిళా కన్వీనర్లు ఉప్పాల మంజుల, బానోత్ రజిని, అసెంబ్లీ నాయకులు వెన్నబోయిన రమేష్, దారెల్లి రమేష్, మట్టే నాగేశ్వరరావు, బాలరాజు, కొమ్ము పూలే, మాల్సూర్, చిన్న రామయ్య, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.