ఆలంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
ఏఆర్‌ఎస్సై , ఏఎస్సై దుర్మరణం
ఆలంపూర్, జూన్ 6 (జనంసాక్షి): ఆలంపూర్ టోల్‌ప్లాజా వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎఆర్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా ఉన్న లారీని ఓవర్‌టేక్ చేయబోయింది. ఆ క్రమం లో లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఎఆర్‌ఎస్‌ఐ సుధాకర్, ఎఎస్‌ఐ శివనాగయ్య సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన సిఎంకు ఎస్కార్టుగా హైదరాబాద్‌కు వెళ్లి కర్నూలుకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వారంతా కర్నూలు జిల్లాకు చెందినవారు.