ఆలయం వద్ద లారీఢికొని భక్తురాలి మృతి

నిజామాబాద్‌, జనంసాక్షి: మాక్లూరు మండలం వడియాట్‌పల్లిలోని వడియాటమ్మ ఆలయం వద్ద లారీ ఢికొని ఒక భక్తురాలు మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ వెనక్కి వెళ్లి లక్ష్మీబాయి అనే భక్తురాలని ఢికొట్టింది. ఆమె అక్కడికక్కడే దుర్మురణం చెందింది. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.