ఆలయ అధికారులు దాసారం గుట్ట ను కాపాడి భూ సేకరణ జరపాలి…

సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి.

కొమురవెల్లి : జనం సాక్షి
ఆలయ అధికారులు   దాసారం గుట్ట ను కాపాడి భూ సేకరణ జరపాలనీ సీపీఎం పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు ఆదివారం దాసారం గుట్ట ను కాపాడి ప్రభుత్వం దేవాదాయ శాఖ భూ సేకరణ జరపాలని ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ గిస బిక్షపతికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద మూడు గుట్టలు కొలువై ఉన్నాయి వాటిలో  మల్లన్న స్వామి ఆలయం ఉన్న గుట్ట, 55 గదుల నిర్మాణం జరుగుతున్న బండ గుట్ట, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెస్ట్ హౌస్ నిర్మించ తలపెట్టిన దాసారo గుట్ట ఈ గుట్ట  పైకి సుమారు నాలుగు కోట్లు వెచ్చించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం జరుపుతున్నారు. సర్వే నంబర్ 223 లో 16 ఎకరాల 30 గుంటల వరకు మల్లన్న ఆలయ ఆధీనంలో ఉన్నది, దీనికి ఆనుకొని సర్వే నంబర్ లో305/A లో సుమారు 22 ఎకరాల భూమి నవాబుల కాలంలో ఐనాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి పట్టా పొంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తులు జెసిబి, భారీ హిటాచి తో గత వారం రోజులనుండి గుట్టను చదును చేస్తున్నారు. విషయం తెలియడంతో రెండు రోజుల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దాసారo గుట్టను పరిశీలించడం జరిగిందినీ. ఈ గుట్టపై సంగన్న, బ్రహ్మం గారి పురాతన కాలం దేవాలయాలు కొలువై ఉన్నాయి. ఆలయాలను కాపాడడంతో పాటు అత్యంత ప్రసిద్ధి చెందిన దాసారం గుట్టను దాని అస్తిత్వాన్ని కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రాంత అందాలను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాల తోపాటు ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అడ్డుకట్టే వేసే విధంగా ఎన్నో చర్యలు చేపట్టారనీ. ప్రస్తుతం దాసరపు గుట్టను కాపాడి ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూసేకరణ జరిపి 22 ఎకరాల భూమిని మల్లన్న ఆలయానికి కొనుగోలు చేయాలని ,లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దాసారం గుట్టను తొలగించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కాబట్టి తక్షణమే స్పందించి అక్రమార్కుల చెర నుండి గుట్టను కాపాడీ గుట్ట కొనుగోలు కు చర్యలు తీసుకోవాలని భక్తుల మనోభావాలకు అనుకూలమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అయినా పూర్ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సనాది భాస్కర్,  కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బక్కెళ్ళి బాలకిషన్, నాయకులు సార్ల యాదయ్య,, ఆరుట్ల రవి, దయానంద్, తదితరులు పాల్గొన్నారు

Attachments area