ఆల్‌ ది బెస్ట్‌

2

– రియో క్రీడాకారులకు మోదీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,జులై 4(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రియో ఒలింపిక్స్‌ క్రీడల్లో పాల్గొనడానికి అర్హత సాధించిన భారత అథ్లెట్లలో సమావేశం అయ్యారు.  ఒలింపిక్స్‌లో పాల్గొనే అథెట్లను ప్రధాని మోడీ కలిశారు. ఢిల్లీలోని మానేక్షా కేంద్రం వద్ద రియో ఒలింపిక్‌ బృందంలోని అథ్లెట్లతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్‌స్లో రాణించాలని ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా మోడీ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. సుమారు 100 మందికిపైగా భారత అథ్లెట్లు రియోకు వెళ్లనున్నారు. ఇంత భారీ సంఖ్యలో క్రీడాకారులతో కూడిన భారత బృందం ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇది మొదటి సారి. ప్రధాని మోడీతో సెల్ఫీ దిగేందుకు క్రీడాకారులు ఉత్సాహం చూపించారు. మొత్తం 13 క్రీడాంశాల్లో భారత్‌ తరపున క్రీడాకారులు పాల్గొననున్నారు. కాగా బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరోలో జరిగే రియో క్రీడలకు 13 క్రీడాంశాల నుంచి 100కుపైగా భారత అథ్లెట్లు  బెర్త్‌ దక్కించుకున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధానితో కరచరణం చేస్తూ అథ్లెట్లు సెల్ఫీలు తీసుకున్నారు.