ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మానకొండూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం
జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 26: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని కె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మానకొండూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం చిగురుమామిడి మండల కన్వీనర్ వంతడుపుల దిలీప్ కుమార్. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో క్రియాశీలక సభ్యత్వం, సాధారణ సభ్యత్వం నమోదు చేయుట, అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్తూ, జాతిని జాగృతి చేస్తూ గ్రామ గ్రామన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం కోసం అందరు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.