ఆవు మలమూత్రాలు తినిపించారు

3

హర్యానా,జూన్‌ 28(జనంసాక్షి):హర్యానాలో గో సంరక్షణ దళ సభ్యులు పాశవికంగా వ్యవహరించారు. ఎద్దుమాంసం ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించారు. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారింది. గో సంరక్షణ దళ సభ్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.