ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి
జూలై 18(జనం సాక్షి )నాంపల్లి కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
తహసిల్దార్ లాల్ బహుదూర్ శాస్త్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఇక్బాల్ లకు వినతి పత్రం అందజేశారు.
ఆశా కార్యకర్తలనుడబ్ల్యూ యచ్ ఓ గుర్తింపును పరిగణన లోనికి తీసుకోవాలని, 45వ ఐ యల్ సి సిఫారసుల మేరకు ఆశా వర్కర్స్ కి కనీస వేతనం,పెన్షన్,ఇ ఎస్ ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని.ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశ వ్యాప్త అఖిల భారత డిమాండ్ డే సందర్భంగా సోమవారం నాంపల్లి తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా వినతి పత్రాన్ని ఇవ్వటం జరిగింది.ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ 2022 మే 22న మన దేశంలొ పని చేస్తున్న 10 లక్షల మంది ఆశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ యచ్ ఓ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డ్ ను అందించింది. ఆశా కార్యకర్తల నుండి రోజూ వారి పని తీసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మా శ్రమను గుర్తించటం లేదని ఆశా కార్యకర్తల ఆందోళనా చెందుతున్నారు.2013 లో 45 వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫారసుల మేరకు ఆశలను కార్మికులగా గుర్తించి , కనీస వేతనం పెన్షన్ ఇ ఎస్ ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. యన్ యచ్ ఎం స్కీమ్ ప్రైవేటీకరణ రద్దు చేసి, ప్రభుత్వమే నిర్వహించి బడ్జెట్ ను పెంచాలని, ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్తున్నంటు ఫిక్స్డ్ వేతనం రూ 10000 ఇవ్వాలని, అలోపు రూ.9750 తగ్గించకుండా మొత్తం చెల్లించాలని,6 నెలల పి ఆర్ సి ఎరియర్స్ వెంటనే ఇవ్వాలని, కరోనా రిస్క్ అలవెన్సు 16 నెలల బకాయిలు,32 రకాల రిజిష్టర్ ప్రింట్ చేసి ఇవ్వాలని,టిబి,యచ్ బి టెస్ట్ లను ఆశా కార్యకర్తల తో చేయించ రాదని,పారితోషికం లేని పనులు ఆశలతో చేయించ కూడదని, ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ మండల ఉపాధ్యక్షులు ఎదుళ్ళ కవిత, సహాయ కార్యదర్శి ఎదుళ్ళ సునీత, కోశాధికారి యాదమ్మ, అరుణ, సైదమ్మ, సునీత, రజిత, అంజమ్మ, రాధిక, పద్మ, సరిత, నీలిమ, శంకరమ్మ రేణుక అనిత,పాల్గొన్నారు.