ఆసరాతో పేదల జీవితం ఆనందమయం
జుక్కల్ సింగిల్ విండో చైర్మన్ శివా నంద్
జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి ),
ఆసరాతో పేదలజీవితం ఆనందమయంగా మారిందని జుక్కల్ సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దే శివానంద్ అన్నారు.ఆయన సోమవారం జుక్కల్ మండలం బిజ్జల్ వాడి గ్రామంలో పాత ఆసరా పించన్ లబ్ధిదారులకు ఆసరాగుర్తింపు కార్డ్ లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో కొద్ది మందికే పింఛన్లు వచ్చేవని, అవికూడా నెలకు రెండువందలు మాత్రమే ఇచ్చేవారని తెలిపారు. తెలంగాణారాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసిర్ వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడి,గీత, చేనేత కార్మికులకు నెలకు రెండు వేల రూపాయలు, వికలాంగులకు మూడువే లరూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు.ఈ పించన్ వచ్చినప్పటి నుండి ఆసరా లబ్దిదారులకు వారి కుటుంబాల్లో,సమాజంలో గౌరవం పెరిగిందని వారంతా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌలే యాదవ్, ఎండీఓ గౌడ్, ఎంపీఓ యాదయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకట్, టీఆర్ఎస్ నాయకులు నీలుపాటిల్, బొల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.