ఆసరా పెన్షన్ తో కొండంత అండ
ప్రభుత్వ విఫ్ రేగ కాంతారావు
372 మంది పెన్షన్ కార్డులు పంపిణీ
ఆళ్లపల్లి సెప్టెంబర్ 01( జనం సాక్షి)
ఆసరా పెన్షన్ తో లబ్ధిదారులకు కొండంత అండని ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆసరా పెన్షన్ మంజూరైనటువంటి లబ్ధిదారులు 372 మందికి పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని నిరుపేదలకు అండగా ఉంటున్నారని అన్నారు అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందాయన్నారు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ,ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులకు, ప్రభుత్వం నెలనెలా రూ 3016, రూ 2016లో చొప్పున నేరుగా వారి ఖాతాలోకి జమ అయ్యే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని అన్నారు. 57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్ మంజూరు చేయడం వలన నిరుపేదలకు ఎంతో సహకారంగా తోడ్పడుతున్నాయని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, వంటి పథకాలతో తోడుగా కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు ఇప్పటికి నియోజకవర్గ అభివృద్ధి బాటలో నడుస్తుందని అభివృద్ధి చేసే వారిని గుర్తుంచుకోవాలని, ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి ,జడ్పిటిసి కొమరం హనుమంతు, గుండాల ఆళ్లపల్లి మండలాల కోపరేటివ్ చైర్మన్, గోగ్గేల రామయ్య, వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య, ఎంపీడీవో మంగమ్మ ,తహసిల్దార్ సాదియా సుల్తాన్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు, సర్పంచులు మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు