ఆసరా పెన్షన్ ప్రతినెల 5 వ తేదీలోపు పంపిణీ చేయాలి

వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత
సంగారెడ్డి సెప్టెంబర్ 22 (జనం సాక్షి) వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి అని కోరుతూ తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టివీవీ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల సమస్యల పైన జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ వికలాంగుల వేదిక సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు మాట్లాడుతూ వికలాంగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు. వికలాంగులందరికీ దళిత బంధు మాదిరిగానే వికలాంగుల బంధు ప్రవేశపెట్టాలి అన్నారు.2016 చట్టం వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది దీనిని పాటిష్టంగా అమలు చేయాలి అన్నారు. డిగ్రీ ఆపైన చదివిన నిరుద్యోగ వికలాంగులకు 5 వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అన్నారు.పత్తి నెల విలాంగుల సమస్యల పైన ప్రజావాణి ఏర్పాటు చేయాలన్నారు.. ప్రతి వికలాంగునికి నెలకు 10.000 పెన్షన్ ఇవ్వాలి అని పేర్కొన్నారు. వికలాంగులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి,వికలాంగుల బ్యాక్ లా గు పోస్టులు భర్తీ చేయాలి అన్నారు జిల్లా కేంద్రంలో ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మించాలి. అంతోదయ 35 కిలోల రేషన్ కార్డు మంజూరు చేయాలి అన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో రాంపులు ఏర్పాటు చేయాలి సదరన్ క్యాంపులో ఆరులైన వికలాంగులకే సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నారు.సదరం క్యాంపులో సదరం విభాగము అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన వారికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు,చదువుతో సంబంధం లేకుండా మోటార్ వెహికల్స్ ఇవ్వాలి అన్నారు. వికలాంగుల శాఖ విలీనం రద్దుచేసి స్వతంత్రంగా కొనసాగించాలి. జిల్లా కేంద్రంలో వికలాంగుల కోసం సివిల్స్ గ్రూప్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి. స్వయం ఉపాధి పథకాల్లో ప్రతి వికలాంగునికి ఐదు లక్షల వరకు రుణం ఇవ్వాలి, ప్రతినెల పెన్షన్ 5 తేదీలోపు ఇవ్వాలి, వికలాంగులు సకలాంగులను పెళ్లి చేసుకుంటే వివాహ ప్రోత్సాహం రెండు లక్షల వరకు ఇవ్వాలి,వికలాంగులకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి, అర్హులైన వికలాంగులకు బ్యాటరీ సైకిల్స్ ఇవ్వాలి.వెన్నుపూస బాధితులకు ప్రతినెల హెల్త్ కిట్టు ఇవ్వాలి. ప్రభుత్వ రంగంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను వికలాంగులకు కేటాయించాలి వికలాంగుల కుటుంబాలకు 200.యూనిట్ వరకు ఉచిత కరెంటు కల్పించాలి
ప్రైవేటు కంపెనీలో మరియు షాపింగ్ మాల్స్ లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి. క్యాంపు లు పెట్టిబోగస్ వికలాంగులను ఏరివేయాలివికలాంగులపై భౌతిక దాడులు నివారించాలి, జాతీయ ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు 200 రోజులు పని కల్పించాలి
ఈ కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు వాసీమ, కోశాధికారి సావిత్రి, జిల్లా సహాయ కార్యదర్శి మల్కాపురం సంగమేశ్వర్, కమిటీ సభ్యులు శోభారాణి, కొనింటి నర్సిములు, రాజుకుమార్, బిస్మిలా సవిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.