ఆసేతు హిమాచలం..కలాంకు సలాం
– పార్థీవదేహానికి ప్రముఖుల నివాళి
– ఘనంగా త్రివిధ దళాలు, రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):భారత మాత ముద్దు బిడ్డ జాతి గర్వించదగ్గ మహానీయుడు మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాంకు ఆసేతు హిమాచలం కలాంకు తలవంచి
వినంమ్రంగా నమస్కరించింది. పాలం విమానాశ్రాయంలో దివంతగ అబ్దుల్ కలాం పార్థివ దేహానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి హవిూద్ అన్సారీ తదితరులు నివాళులర్పించారు. వీరితో పాటు కేంద్ర మంత్రి మనోహర్ పారికర్, లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కేజీవ్రాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, త్రివిధ దళాల అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముందు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని గౌహతి నుంచి రక్షణశాఖ ప్రత్యేక విమానంలో ఢిల్లీ పాలెం విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కలాం పార్థివదేహం దిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకోగానే త్రివిధ దళాధిపతులు ఘనంగా నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులతో పాటు రక్షణశాఖకు చెందిన పలువురు అధికారులు కలాం పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తరవాత ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితరులు అక్కడికి చేరుకుని భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. పాలం విమానాశ్రయం నుంచి సైనిక శకటంలో కలాం భౌతికకాయన్ని దిల్లీలోని సేనా భవన్‌కు తరలించారు. సోమవారం నాడు మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతిక కాయం ఢిల్లీ చేరుకుంది.ప్రత్యేక విమానంలో ఇక్కడ వచ్చిన పార్ధీవ దేహానికి సైనికాధికారులు ప్రభుత్వ లాంఛనాలతో కిందకు తీసుకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచారు.అక్కడ తొలుత ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. ఆ తర్వాత ఉప రాష్ట్రపతి హవిూద్ అన్సారీ పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు.తదుపరి రాష్ట్రపతి ప్రణబ్ వచ్చి నివాళి అర్పించిన తర్వాత సైనిక వందనం గీతాలాపన జరిగాయి. గీతాలాపన సమయంలో సైనికాధికారులు, రాష్ట్రపతి సాల్యూట్ చేశారు.ఆ తర్వాత రాష్ట్రపతి మరికొంతసేపు మౌనంగా నిలుచుని శ్రద్దాంజలి ఘటించారు. ఆ తర్వాత మిలటరీ బాండ్ వారు మరో గీతాన్ని ఆలాపించి శ్రద్దాంజలి ఘటించారు. విమానాశ్రయం నుంచి డిల్లీలోని కలాం నివాసానికి పార్దీవదేహాన్ని తరలించారు. శ్రద్దాంజలి ఘటించిన తర్వాత రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ ఏకాంతంగా కొంతసేపు మాట్లాడుకోవడం కనిపించింది. ప్రజల సందర్శనార్థం టెన్ రాజాజీమార్గ్‌లోని అధికారిక నివాసానికి తరలించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కలాం మృతి పట్ల మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కలాం గొప్ప మేధావి అని….ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు ప్రజలను చేరువ చేసేందుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కలాం చివరిక్షణం వరకు విద్యార్థులతోనే గడిపారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయనొక దార్శనికుడని అన్నారు. పాలెం విమానాశ్రయంలో కలాం పార్థవదేహానికి పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆద్వానీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సంతాపం తెలిపారు. దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వారిలో కలామే గొప్పవాడు ఆడ్వాణీ కొనియాడారు. దేశానికి ఆదర్శప్రాయుడు, అద్భుతమైన వ్యక్తి కలాం అని సచిన్ అన్నారు.
పార్లమెంట్ ఘన నివాళి
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతికి లోక్‌సభ, రాజస్యభ అంజలి ఘటించాయి. ఇరు సభల సభ్యులందరూ రెండు నిమిషాల పాటు నిలబడి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలాం గొప్పదనాన్ని స్మరించుకున్నారు. అలాగే కలాం సేవలను కొనియాడుతూ కేంద్ర క్యాబినేట్ సంతాప తీర్మానం ప్రకటించింది.
కాంగ్రెస్ సంతాపం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం ప్రజల మనిషి అని రాహుల్‌గాంధీ కొనియాడారు. కలాం విజన్‌ను, ఆయన ఆలోచనలను కోల్పోయామని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి క్షణం వరకు దేశం కోసం పనిచేసిన మ¬న్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని రాహుల్ అన్నారు. యువతలో ఆలోచనలను తట్టిలేపిన గొప్ప వ్యక్తి కలాం అని చెప్పారు. రాష్ట్రపతిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివని అన్నారు. దేశం మొత్తం ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన చెప్పారు. కలాం ఆశయ సాధనకు యువత పాటుపడాలని రాహుల్ గాంధీ సూచించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన హఘాన్మరణం దేశానికి తీరని లోటన్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను తాను ఎప్పుడూ గురువుగానే భావిస్తానని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. కలాం మరణం పట్ల గవర్నర్ సంతాపం తెలిపారు. కలాం మరణం దేశానికి తీరని లోటన్నారు. దేశానికి ఎనలేని సేవలు అందించిన మహానేత కలాం అని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. మరోవైపు కలాంకు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చిరంజీవి సంతాపం తెలిపారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ అబ్దుల్ కలాం చేతుల విూదుగా ప్రారంభం కావడం తన అదృష్టమని చిరంజీవి అన్నారు. ఆయన మృతిపట్ల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంతాపం తెలిపారు. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు కలాం అని ఆయన కొనియాడారు. సామాన్యుల రాష్ట్రపతిగా కలాంకు గుర్తింపు ఉందన్నారు. యువత వల్లే దేశ అభివృద్ధి సాధ్యమని కలాం చెప్పే వారని లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మృతి యావత్ దేశానికి తీరని లోటని చెప్పారు. దేశాన్ని ప్రభావితం చేసిన మహానుభావుడు కలాం అని కొనియాడారు. సామాన్యుల రాష్ట్రపతిగా కలాం గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. యువత వల్లే దేశ అభివృద్ధి సాధ్యమని కలాం చెప్పేవారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.మాజీ రాష్ట్రపతి కలాం మృతి దేశానికి తీరని లోటు అని స్వామి స్వరూపానంద ఆవేదన వ్యక్తం చేశారు. తొలి ఏకాదశి రోజు పరమపదించిన కలాంకు పుణ్యలోకం ప్రాప్తిస్తుందని స్వరూపానంద అన్నారు.
కలాంతో సుదీర్ఘ అనుబంధం: గవర్నర్
మాజీరాష్ట్రపతి కలాంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. వ్యక్తిగతంగా కూడా తనకు అబ్దుల్ కలాం తో పాతికేళ్లుగా సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే ఆయనకు సరైన నివాళి అవుతుందని గవర్నర్ అన్నారు.రాష్ట్ర విభజన గురించి జరిగిందేదో జరిగిపోయిందని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారని, రెండు రాష్ట్రాల అభివృద్దిపై దృష్టి పెట్టాలని కోరారని గవర్నర్ నరసింహన్ చెప్పారు. తనకు కలాంతో ఉన్న అనుబంధాన్ని ఆయన వివరిస్తూ ఈ విషయం చెప్పారు. విభజన తర్వాత ఇప్పుడు జరగవలసింది రెండు రాష్ట్రాల అభివృద్ది అని, అనుభవం కలిగిన నీవు ఆ దిశగా రెండు రాష్ట్రాల ను తీసుకు వెళ్లాలని కోరారని ఆయన తెలిపారు. ఎప్పుడు వచ్చినా ప్రజల గురించి ,ప్రజల సమస్యల గురించే మాట్లాడేవారని గవర్నర్ తెలిపారు. ఆయన దార్శనికుడని, తనలాంటి వారిని ఎందరినో ప్రోత్సహించారని అన్నారు.